-->

నేను కన్నెర్రజేస్తే చస్తారు!" — ఉజ్జయినీ మహంకాళి బోనాల్లో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి

నేను కన్నెర్రజేస్తే చస్తారు!" — ఉజ్జయినీ మహంకాళి బోనాల్లో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి


సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో భవిష్యవాణి కార్యక్రమం నిర్వహించబడింది. అమ్మవారి పూనికతో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చేస్తూ మాట్లాడుతూ, ప్రజలు డప్పుచప్పుళ్లతో బోనాలు సమర్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ప్రతీసారి ఉత్సవాల్లో ఆటంకాలు కలుగుతున్నాయని, తనను ఎవ్వరూ గౌరవించకపోతున్నారని ఆమె పేర్కొన్నారు.

"రాసుల కొద్దీ సంపద తెచ్చిపెడుతున్నా గోరంతైనా నాకు దక్కడం లేదు... నేను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుని చస్తారు!" అని హెచ్చరించిన ఆమె, నిత్యం భక్తితో కొలిచే వారికే తన ఆశీర్వాదాలు ఉంటాయని స్పష్టం చేశారు. అమ్మవారి ఆగ్రహాన్ని తొలగించేందుకు ప్రధాన అర్చకులు నీవేళ పూజలపై మరింత శ్రద్ధ వహిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.

Blogger ఆధారితం.