-->

తిరుమలగిరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

తిరుమలగిరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం


సూర్యాపేట, ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రేపు (జూలై 14) తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రితో కలిసి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు. తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా తొలి విడత రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు.

ప్రజల ఆర్థిక భద్రత, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయంగా కొనసాగుతోంది. కొత్తగా జారీ చేస్తున్న ఈ రేషన్ కార్డులు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నిరుపేద కుటుంబాలకు మేలు చేసేలా ఉండనున్నాయి. ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ఇది మరో మైలురాయిగా నిలవనుంది.


జన హితం కోసమే – ప్రజల పక్షాన ప్రభుత్వ సేవలు కొనసాగుతూనే ఉంటాయి.

Blogger ఆధారితం.