-->

ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడడంతో ఏడుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడడంతో ఏడుగురు మృతి


అన్నమయ్య జిల్లా: జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడికాయల లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ రెడ్డిపల్లె చెరువు కట్టపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరోకొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.

మృతులంతా మామిడికాయలు కోసే కూలీలుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బోల్తా పడిన లారీని క్రేన్ సాయంతో తొలగించి, రోడ్డుపై నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ భరోసా కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.