ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న నిస్పృహతో యువతి ఆత్మహత్య
హనుమకొండ జిల్లా పెద్దకోడెపాక గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రావుల ప్రత్యూష (24) అనే యువతి ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
ప్రత్యూష బీటెక్ పూర్తి చేసి గత రెండు సంవత్సరాలుగా కష్టపడి చదువుతోంది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం entrance పరీక్షలు రాస్తూ పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినప్పటికీ, కొద్దిపాటి మార్కుల తేడాతో ఉద్యోగం సాధించలేకపోయింది. ఇది ఆమెను తీవ్ర నిరాశకు గురిచేసింది.
శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో దూలానికి ఉరేసుకొని ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటికి ఆమె అమ్మమ్మ లక్ష్మి గమనించి కేకలు వేయగా, వెంటనే చుట్టుపక్కలవారు వచ్చారు. కానీ అప్పటికే ప్రత్యూష మృతిచెందినట్లు గుర్తించారు.
ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, వాటి కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, నిరాశ — ఇవన్నీ ప్రతీ ఇంటికీ ఆలోచనకు లోనుచేసే అంశాలుగా మారాయి.
Post a Comment