తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహణకు సీఎం రేవంత్ ప్రయత్నం
తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయని భేటీ అయ్యారు.
🔷 ఖేలో ఇండియా గేమ్స్, 40వ జాతీయ క్రీడలు, ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లను తెలంగాణలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
🔷 ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రంలో క్రీడాకారుల శిక్షణా కేంద్రాలు, క్రీడా వసతుల అభివృద్ధి కోసం విధులు కేటాయించాలని కోరారు.
🔷 జాతీయ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులకు గతంలో ఇచ్చిన రైల్వే ప్రయాణ ఛార్జీల రాయితీలు మళ్లీ అమలు చేయాలని విన్నవించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు డా. మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి గారులు హాజరయ్యారు.
👉 ఈ అభ్యర్థనలతో తెలంగాణలో క్రీడల అభివృద్ధికి మరింత బలం చేకూరే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Post a Comment