-->

ప్రకృతిని కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుంది – మంత్రి సీతక్క

ప్రకృతిని కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుంది – మంత్రి సీతక్క


ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు దహలవారిగా చేపడతామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు.

సోమవారం (జూలై 7) ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర టి.ఎస్. తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా:

  • చిన్నబోయినపల్లి గ్రామంలో రూ. 55 లక్షల అంచనా వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు
  • చిన్నబోయినపల్లి నుంచి పెద్దవెంకటాపూర్ వరకు రూ. 1.60 కోట్లతో బిటుమిన్ (బీ.టి) రోడ్ నిర్మాణం
  • షాపల్లి గ్రామంలో రూ. 70 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం

పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా వనమహోత్సవంలో భాగంగా, నేషనల్ హైవే పక్కన కలెక్టర్ తో కలిసి మొక్కలు నాటిన మంత్రి గారు మాట్లాడుతూ – “ప్రకృతిని మనం రక్షిస్తే అది మన భవిష్యత్తును రక్షిస్తుంది. మొక్కలు నాటడం, వాటి సంరక్షణ అందరి బాధ్యత” అని అన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా మొక్కల నాటే లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, గ్రామస్థులు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కార్యక్రమాలను దశలవారీగా చేపడతామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ శ్రీ అజయ్ కుమార్, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ వీరభద్రం, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.