-->

భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య!

భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య!


నంద్యాల జిల్లా: ఇది సినిమాను తలపించే ఘోర ఘటన. కుటుంబ కలహాలతో విడిపోయిన భార్య తన భర్తను భయంకరంగా హత్య చేసిన ఘటన నంద్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన 50 ఏళ్ల రమణయ్య, గత రెండు నెలలుగా పుట్టింట్లో ఉంటున్న భార్య రమనమ్మను తిరిగి ఇంటికి తీసుకురావడానికి మంగళవారం ఆమె వద్దకు వెళ్లారు. అయితే అదే ఆయనకు చివరి ప్రయాణమైంది.

సంక్షిప్తంగా కుటుంబ వివాదాలు ఊహించని దారుణానికి దారితీశాయి. రమనమ్మ తన సోదరుడి సహకారంతో రమణయ్యను హత్య చేసి, మృతదేహాన్ని కారులో నంద్యాల జిల్లా నూనెపల్లెకి రాత్రివేళ తీసుకొచ్చి – చనిపోయిన భర్త ఇంటి ఎదుట పడేసింది! చెప్పుకోడానికి డోర్ డెలివరీ చేసినట్టే వ్యవహారం సాగింది.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటన స్థలానికి చేరుకున్న నంద్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు, పూర్తి స్థాయిలో ప్లాన్ ఉన్నదా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.