-->

తిరుపతిలో అద్భుతం: శివలింగం కళ్లు తెరిచిన దృశ్యం.. పోటేత్తిన భక్తులు

తిరుపతిలో అద్భుతం: శివలింగం కళ్లు తెరిచిన దృశ్యం.. పోటేత్తిన భక్తులు

తిరుపతిలో అద్భుతం: శివలింగం కళ్లు తెరిచిన దృశ్యం.. పోటేత్తిన భక్తులు 

తిరుపతి నగరంలో అరుదైన ఆధ్యాత్మిక ఘటన చోటుచేసుకుంది. టెంపుల్ సిటీగా ప్రసిద్ధి పొందిన తిరుపతిలోని గాంధీ పురంలోని రామలింగేశ్వర ఆలయంలో శివలింగంపై కళ్లు ఏర్పడిన అద్భుత దృశ్యం భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.

అలవాటుగానే రాత్రి పూజల కోసం ఆలయానికి వచ్చిన భక్తులు రాత్రి 8:30 ప్రాంతంలో శివలింగంపై స్పష్టంగా కళ్లు కనిపిస్తున్నట్టు గమనించారు. క్షణాల్లో ఈ వార్త స్థానికంగా వైరల్‌గా మారింది. ఆలయం వద్ద భక్తుల సందడి పెరిగింది. పరమశివుని కళ్లు తెరిచినట్లు భావించి, భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మొబైల్ ఫోన్లలో ఈ అద్భుతాన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. శివలింగాన్ని దర్శించి పూజలు నిర్వహించిన భక్తులు శ్రావణ మాసంలో ఇలాంటి దృశ్యం దర్శించడాన్ని మహాదేవుని అనుగ్రహంగా భావిస్తున్నారు.

ఈ సందర్శనకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో డీఆర్ మహల్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. కాగా, ఆలయ పూజారులు దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ, భక్తుల ఉత్సాహం పెరిగిపోతోంది.

నెటిజన్లు దేవుని మహిమగా ఈ దృశ్యాన్ని విస్తృతంగా షేర్ చేస్తుండగా, స్థానికులు ఈ ఆలయంలో ఈవిధమైన దృశ్యం తొలిసారిగా కనిపించిందని చెబుతున్నారు. ఇప్పటికీ వేలాదిమంది భక్తులు శివలింగాన్ని దర్శించేందుకు ఆలయానికి రావడం కొనసాగుతోంది.
Blogger ఆధారితం.