-->

పర్యావరణ పరిరక్షణలోనే మానవ సమాజ శ్రేయస్సు షేఖ్ అబ్దుల్ బాసిత్, జమాతే ఇస్లామి హింద్

పర్యావరణ పరిరక్షణలోనే మానవ సమాజ శ్రేయస్సు షేఖ్ అబ్దుల్ బాసిత్, జమాతే ఇస్లామి హింద్


కొత్తగూడెం, అభివృద్ధి పేరుతో పర్యావరణానికి హాని కలిగించే చర్యలకు వ్యతిరేకంగా జమాతే ఇస్లామి హింద్ జాతీయ సభ్యులు షేఖ్ అబ్దుల్ బాసిత్ స్పందించారు. పవిత్ర శుక్రవారం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ 12వ వార్డులోని సుభాష్ చంద్రబోస్ నగర్ లో "మస్జీద్ ఎ అలి" మస్జిద్ లో మధ్యాహ్నం నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన, సమాజ హితానికి, భవిష్యత్ తరాల ఆరోగ్యానికి పర్యావరణ పరిరక్షణ అత్యవసరం అని హితవు పలికారు.

“సమాజానికి హాని కలిగించకుండా జీవించడమే నిజమైన దైవభక్తి” అని పేర్కొన్న షేఖ్ బాసిత్, జీవకోటి మనుగడకు మూలమైన నీటి మూలాలను కలుషితం చేయకూడదని, చెట్లను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనందరిదీ అని తెలిపారు.

ఖురాన్‌లో సృష్టికర్త భూమిని సమతుల్యంగా నిర్మించాడని, ఆ సమతుల్యతను భంగం చేయవద్దని స్పష్టంగా హెచ్చరికలున్నాయని చెప్పారు. "భూమిపై మొక్క నాటినవారికి స్వర్గంలో దైవం మొక్క నాటుతాడు" అనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాక్యాన్ని ఉదహరిస్తూ, పర్యావరణ పరిరక్షణ కూడా ఆధ్యాత్మిక ధర్మమేనని తెలిపారు.

విద్యార్థులు, యువత ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మౌలానా, మస్జీద్ అధ్యక్షుడు జైనులాబుద్దీన్ (బాబా), జావిద్, మస్తాన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.