ఐనవోలు తహసీల్దార్‌ను బెదిరించిన పీడీఎఫ్ పత్రిక విలేకరులు అరెస్ట్
హనుమకొండ, ఐనవోలు తహసీల్దార్‌ను డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో పీడీఎఫ్ పత్రికకు చెందిన ఇద్దరు విలేకరులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన దామెర రవీందర్, దామెర రాజేందర్ అనే ఇద్దరు కొంతకాలంగా పీడీఎఫ్ పత్రికలో పనిచేస్తున్నారు. ఆధారాలు లేని వార్తలు రాసి అధికారులను, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇటీవల తహసీల్దార్ కనుపర్తి విక్రమ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకొని, తనపై బ్లాక్‌మెయిల్‌కు దిగినట్లు పోలీసులు తెలిపారు. అవాస్తవమైన వార్తలు రాయొద్దంటూ తహసీల్దార్‌ను బెదిరించి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. భయంతో తహసీల్దార్ జూలై 20న రూ.20 వేలు ఆన్‌లైన్‌లో చెల్లించగా, జూలై 21న మిగతా డబ్బులు కూడా కోరుతూ వీరిలో ఒకరు తహసీల్దార్ కార్యాలయంలో గొడవకు దిగారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రవీందర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు ఐనవోలు ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపారు.
Post a Comment