-->

ఉద్యమ నాయకురాలు మంజుల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. సహాయహస్తాల కోసం ఎదురుచూపు

ఉద్యమ నాయకురాలు మంజుల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. సహాయహస్తాల కోసం ఎదురుచూపు
ఉద్యమ నాయకురాలు మంజుల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. సహాయహస్తాల కోసం ఎదురుచూపు

👉 గుండె, లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఉద్యమకారిణి జాడి మంజుల
👉 టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు వెంకట పుల్లయ్య హస్తక్షేపం – హైదరాబాద్ మహావీర్ హాస్పిటల్‌కు తరలింపు
👉 “మనం” పత్రిక బృందం, జర్నలిస్ట్ సంఘాల మద్దతు
👉 వైద్య ఖర్చుల నిమిత్తం PhonePe/GooglePay ద్వారా సాయానికి పిలుపు: 9640542368

కొత్తగూడెం జిల్లా రైటర్స్ బస్తిలో నివాసముండే దళిత ఉద్యమ నాయకురాలు జాడి మంజుల గత కొంతకాలంగా తీవ్రమైన గుండె, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. చిన్ననాటి నుంచే తల్లిదండ్రులను కోల్పోయిన మంజుల విద్యార్థి సంఘం (PDCSU), మహిళా సంఘం (POW)లలో చురుకుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో అనేక కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు.

విద్యాసంస్థల సమస్యల పరిష్కారానికి విద్యార్థుల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ అంకితంగా నిలిచిన మంజుల, ఉద్యమ కళాకారుడు కొండ జంపన్నను వివాహం చేసుకుని కొత్తగూడెంలో నివాసం ఉంటున్నారు. జంపన్న ప్రస్తుతం "మనం" పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

మంజుల ఆరోగ్య సమస్యలు తీవ్రమవడంతో, కుటుంబం వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితిలో ఉన్న వేళ టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు వెంకట పుల్లయ్య తక్షణమే స్పందించి హైదరాబాద్ మహావీర్ హాస్పిటల్‌కి తరలించారు. "మనం" బృందంతో పాటు జర్నలిస్టులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ వారి వైద్యానికి ఆర్థికంగా తోడ్పడుతున్నారు.

ప్రస్తుతం మంజుల హైదరాబాద్ మహావీర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె ప్రాణాలు నిలబెట్టేందుకు మానవత్వంతో స్పందించాల్సిన సమయం ఇది అని ఉద్యమ మిత్రులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.

సాయం చేయదలచిన వారు

PhonePe / Google Pay: 9640542368
ఖాతాదారు పేరు: కొండ జంపన్న – మంజుల

Blogger ఆధారితం.