19 ఏళ్ల యువకుడు 38 ఏళ్ల మహిళ నాన్-టీచింగ్ స్టాఫ్ వయస్సుతొ తేడా లేదు… ప్రేమలో లీనమైన జంట!
చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన వయస్సు తేడా ఎంతైనా ప్రేమకు అవరోధం కాదన్నట్లు ఓ యువకుడు, మద్య వయసు మహిళ ప్రేమలో పడటం స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు అర్బన్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే... చిత్తూరు నగరానికి చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు ప్రైవేట్ కాలేజీలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో 38 ఏళ్ల మహిళ నాన్-టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లయి భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాలేజీలో పరిచయమైన ఈ ఇద్దరి మధ్యన ఉన్నత భావాలు పెరిగి ప్రేమగా మారాయి.
అయితే వయస్సు తేడా దృష్ట్యా సమాజం తమ ప్రేమను అంగీకరించదని భావించిన వీరు, ఎవరికీ చెప్పకుండా మూడు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లిపోయారు. దీంతో యువకుడిని మిస్సింగ్ అయినట్లు అతని తల్లిదండ్రులు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు కొనసాగించి, బెంగళూరులో వీరి బసను గుర్తించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ చిత్తూరుకు తీసుకొచ్చారు. అనంతరం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి, వారిని విడిగా కౌన్సెలింగ్ చేశారు. చివరకు యువకుడిని తల్లిదండ్రులతో ఇంటికి పంపించగా, మహిళ కూడా స్వగృహానికి వెళ్లిపోయినట్లు సీఐ నెట్టికంటయ్య తెలిపారు.
Post a Comment