కోతుల బెడదపై రాష్ట్రపతికి విజ్ఞాపన... గార్లలో ఈశ్వర్ లింగం వినూత్న ప్రయత్నం
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలకేంద్రంలో కోతుల బెడద తీవ్రంగా మారింది. పొలాలపై విరిగిపడే కోతులు, గృహాల్లోకి ప్రవేశించి ఆహార పదార్థాలు దొంగిలించడం, పిల్లలపై దాడులు చేసేందుకు కూడా వెనుకాడటం లేదని స్థానికులు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులు, స్థానిక అధికారులు వినిపించుకోకపోవడంతో గార్లకు చెందిన ఈశ్వర్ లింగం అనే వ్యక్తి నేరుగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి లేఖ రాశారు. తన గ్రామంలో కోతుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆశ్చర్యకరంగా, రాష్ట్రపతి భవన్ ఈ లేఖకు స్పందించింది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనివల్ల ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
సామాన్యుడి వినూత్న పోరాటం
సాధారణంగా తహసిల్దార్, ఎంపీడీఓ, ఎమ్మెల్యే, ఎంపీ వంటి స్థాయిలను ఆశ్రయించే పరిస్థితుల్లో ఈశ్వర్ లింగం నేరుగా దేశ అత్యున్నత పదవిని అధిష్ఠించిన రాష్ట్రపతిని ఆశ్రయించడం వినూత్నంగా ఉంది.
ఇది ప్రజల సమస్యలపై పెద్దల దృష్టిని ఎలా లాక్కోవచ్చో సూచించే ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పుడు అధికార యంత్రాంగం స్పందించి కోతుల బెడదపై కార్యాచరణ తీసుకుంటుందా? అన్నదే ఆసక్తికరమైన అంశం.
Post a Comment