బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ సిటీ: బోనాల పండుగను పురస్కరించుకొని భక్తుల రద్దీ పెరిగే నేపథ్యంలో, నగరంలోని ప్రధాన ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల జూలై 20, 21 తేదీల్లో ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
🔸 లాల్‌దర్వాజా మహంకాళి ఆలయం పరిసరాల్లో డైవర్షన్ వివరాలు:
📍 జూలై 21న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సాధారణ వాహనాలకి అనుమతి లేదు.
➡️ ఇంజన్‌బౌలి – ఫలక్‌నుమా వైపు నుంచి వచ్చే వాహనాలను న్యూ షంషేర్‌గంజ్ ద్వారా గోశాల, మిస్రీగంజ్ వైపుకు మళ్లిస్తారు.
➡️ మహబూబ్‌నగర్ క్రాస్‌రోడ్ నుంచి ఆలియాబాద్ వైపు వెళ్లే వాహనాలు జమనుమా – గోశాల వైపునకు డైవర్ట్ అవుతాయి.
➡️ నాగులచింత, సుధాటాకీస్ వైపు నుంచి వచ్చే వాహనాలు గౌలిపురా దిశగా మళ్లింపు.
➡️ చార్మినార్ నుంచి నల్లచింత వైపుకు వెళ్లే వాహనాలు హరిబౌలి – ఓల్గా హోటల్ మార్గంలోకి మళ్లింపు.
🅿️ పార్కింగ్ ఏర్పాట్లు:
భక్తుల వాహనాల కోసం కింది ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు:
- షాలిబండ ప్రధాన రోడ్
- ఆర్యవైశ్య మందిర్
- వీడీపీ స్కూల్ గ్రౌండ్
- మిత్రా స్పోర్ట్స్ క్లబ్
- చార్మినార్ బస్టర్మినల్
- ఢిల్లీ గేట్
🔸 అంబర్‌పేట్ మహంకాళి ఆలయం పరిసరాల్లో:
ఉప్పల్ నుండి చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్ వైపు వెళ్లే భారీ వాహనాలు, సిటీ బస్సులు, ఆర్టీసీ బస్సులు — అంబర్‌పేట్ ఫ్లైఓవర్ మీదగానే ప్రయాణించాలి.
🔸 చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయం పరిసరాల్లో:
📅 ఆదివారం, సోమవారం (జూలై 20, 21)
🕔 ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సాధారణ వాహనాలకు అనుమతి లేదు.
➡️ ప్రజలందరూ సహకరించాల్సిందిగా ట్రాఫిక్ పోలీసుల విజ్ఞప్తి.
➡️ ప్రయాణించే ముందు మార్గ వివరాలు తెలుసుకొని, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.
Post a Comment