రూ.30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన సహాయ కార్మిక అధికారిణి
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి: మృత ఉద్యోగి సహజ మరణ దావా మరియు అంత్యక్రియల ఖర్చుల మంజూరుకు సంబంధించి దరఖాస్తును ప్రాసెస్ చేయడానికే రూ.30,000 లంచం తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అవినీతి ఘటనలో బెల్లంపల్లి లోని సహాయ కార్మిక కార్యాలయంలో పనిచేస్తున్న సహాయ కార్మిక అధికారిణి పాకా సుకన్య, ఆమె ప్రైవేటుగా పెట్టుకున్న సహాయకురాలు మోకినేపల్లి రాజేశ్వరి లు పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారురాలి భర్త మృతిచెందిన నేపథ్యంలో ప్రభుత్వ విధాన ప్రకారం సహజ మరణ దావా మరియు అంత్యక్రియల ఖర్చుల కోసం ఫైలు అధికారి వద్దకు వెళ్లిన ఆమెకు, దానిని పై అధికారుల అనుమతి కోసం పంపేందుకు రూ.30,000 లంచం డిమాండ్ చేశారు. దీనిపై బాధితురాలు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ను సంప్రదించగా, అధికారులు ఉచ్చులో పడేలా ఏర్పాటు చేసి ఇద్దరినీ పట్టుకున్నారు.
ప్రజలకు ACB విజ్ఞప్తి:
ఒకవేళ ఏ ప్రభుత్వ ఉద్యోగి లేదా అధికారి లంచం అడిగినట్లయితే, వెంటనే తెలంగాణ అవినీతి నిరోధకశాఖను సంప్రదించండి:
Post a Comment