-->

50,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి అడ్డంగా దొరికిన కార్మిక అధికారి

 

50,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి అడ్డంగా దొరికిన కార్మిక అధికారి

మంచిర్యాల, నమోదిత కార్మికుడిగా ఉన్న ఓ వ్యక్తి తన సోదరుని ప్రమాద మరణానికి సంబంధించి ప్రమాద మరణ దావా మరియు అంత్యక్రియల ఖర్చుల మంజూరుకు సంబంధించి ఫైల్ ప్రాసెసింగ్ కోసం సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆ దరఖాస్తును ప్రాసెస్ చేసి ఉన్నతాధికారులకు పంపేందుకు సహాయ కార్మిక అధికారి కాటం రామ్ మోహన్, సిర్పూర్ కాగజ్ నగర్ ఇంచార్జ్, ఫిర్యాదుదారుడి నుంచి రూ.50,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతినిరోధక శాఖ (ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

ఈ సందర్భంగా ప్రజలకు ACB విజ్ఞప్తి చేస్తూ –
"ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే, వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయండి. అదేవిధంగా,
📱 వాట్సాప్: 9440446106
📘 Facebook: Telangana ACB
🐦 X (Twitter): @TelanganaACB
🌐 Website: acb.telangana.gov.in
వాటిద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు" అని తెలిపింది.

గమనిక: ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

Blogger ఆధారితం.