-->

ప్రమాణ స్వీకారానికి తరలిన రెండు వందల కార్ల కాన్వాయ్ – తూప్రాన్‌లో ఘనంగా ర్యాలీ

 

ప్రమాణ స్వీకారానికి తరలిన రెండు వందల కార్ల కాన్వాయ్ – తూప్రాన్‌లో ఘనంగా ర్యాలీ

తూప్రాన్, : Bv నాచగిరి లక్ష్మీనృసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా లయన్ పల్లెర్ల రవీందర్ గుప్త ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని తూప్రాన్ పట్టణం ఘనతను సంతరించుకుంది. రెండు వందల కార్లతో కూడిన భారీ కాన్వాయ్ తో రవీందర్ గుప్త ఆలయానికి తరలిపోయారు.

ఈ సందర్భంగా తూప్రాన్ ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట క్రేన్ సహాయంతో గజమాలతో స్వాగతం పలికారు ఆర్య వైశ్య సంఘం నాయకులు. అనంతరం తూప్రాన్ అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి నాచారం లక్ష్మీనృసింహ స్వామి ఆలయం దాకా సుమారు 10 కిలోమీటర్ల భారీ ర్యాలీ కొనసాగింది. ర్యాలీ నగరమంతా హర్షాతిరేకాల మధ్య సాగింది.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా డిసిసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి, మామిండ్ల కృష్ణ, నందాల శ్రీనివాస్, కోడిప్యాక నారాయణగుప్త, పల్లెర్ల బాలేష్ గుప్త, రామునిగారి శ్రీశైలంగౌడ్, చింతల రవీందర్ రెడ్డి, భానపురం రాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

తూప్రాన్ లయన్స్ క్లబ్ తరఫున డాక్టర్ జానకిరామ్ సిఆర్, డాక్టర్ ప్రదీప్ సింహ, పుట్ట వెంకటేష్, వంగ భాస్కర్ రెడ్డి, బుడ్డ భాగ్యరాజు, అప్సర్ భాయ్, కుమ్మరి రమేష్, గరిగే నర్సింగ్ రావు, జగ్గన్నగారి దామోదర్ రెడ్డి, నీల ప్రవీణ్ కుమార్ గుప్త, చకిలం సంతోష్ గుప్త, నేతి సాగర్ గుప్త, కృష్ణారెడ్డి, మహమ్మద్ హమ్మద్ భాయ్, పచ్చిమట్ల మల్లేష్ గౌడ్, డాక్టర్ సంతోష్ కుమార్ (డెంటిస్ట్), బి. నాగరాజు గౌడ్ (చార్టెడ్ అకౌంటెంట్), డాక్టర్ శేఖర్ బాబు తదితరులు హాజరయ్యారు.

అలాగే తూప్రాన్ పట్టణ, మండల ఆర్య వైశ్య సంఘాలు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, కిరాణా వర్తక సంఘ నాయకులు కూడా ఈ వేడుకలో భాగమయ్యారు. సామూహికంగా విశేష ఆదరణ మధ్య సాగిన ఈ కార్యక్రమం వైశ్య సమాజ శక్తిని ప్రతిబింబించింది.

Blogger ఆధారితం.