-->

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం ఇంట్లో ఒంటరిగా ఉన్న 12ఏళ్ల బాలికను హత్య

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం ఇంట్లో ఒంటరిగా ఉన్న 12ఏళ్ల బాలికను హత్య


హైదరాబాద్ నగరాన్ని కుదిపేసేలా కూకట్‌పల్లిలో దారుణ హత్య జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన సంగీత్‌నగర్ కాలనీలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం— మృతి చెందిన చిన్నారి సహస్ర (12). ఆమె తల్లిదండ్రులు రేణుక, కృష్ణ ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగులు. ప్రతిరోజు మాదిరిగానే వారు ఉదయం ఆఫీస్‌కి వెళ్లగా ఇంట్లో సహస్ర ఒంటరిగా ఉంది. ఈ సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బాలికను పొట్టనబెట్టుకుని పరారయ్యారు.

మధ్యాహ్నం సమయంలో బాలిక కదలికలు కనిపించకపోవడంతో పొరుగువారు అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని సహస్ర విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి షాక్‌కి గురయ్యారు. చిన్నారి మృతదేహం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికుల సమాచారంతో కూకట్‌పల్లి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌తో సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ – “ఇంట్లో మన కొడుకు కూడా ఉండి ఉంటే అతనినీ చంపేసేవారు కదా” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ హత్య వెనుక గల అసలు కారణం ఏమిటి? ఇంట్లో దొంగతనం కోసం ప్రవేశించారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793