-->

రెడ్డి కులస్థులు సంఘటితం కావాలి : పిట్ట శ్రీనివాస్‌రెడ్డి

రెడ్డి కులస్థులు సంఘటితం కావాలి : పిట్ట శ్రీనివాస్‌రెడ్డి


చెన్నూరు,  రెడ్డి కులస్థులందరూ ఏకమై, సంఘటితం అవ్వాలని రాష్ట్ర రెడ్డి జాగృతి అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కిష్టంపేటలోని బీఎంఆర్ గార్డెన్స్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్ జిల్లాల రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.

రెడ్డి కులస్థుల ఆత్మాభిమానాన్ని కించపరిచే చర్యలు ఎవ్వరూ చేయరాదని హెచ్చరించిన ఆయన, “రెడ్డిగానే పుట్టాం, రెడ్డిగానే పెరిగాం, రెడ్డిగానే చనిపోదాం” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 40 మంది ఎమ్మెల్యేలు, 7 మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో రెడ్డి కమిషన్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

బీద రెడ్డి కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, విద్యార్థులకు సహాయం అందించాలంటూ పిలుపునిచ్చారు. ఈ ఆత్మీయ సమ్మేళనం చెన్నూరులో ప్రారంభమై రాష్ట్ర, దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.

కార్యక్రమంలో జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షుడు గుర్రాల మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడు సంతోషం గోపాల్‌రెడ్డి, నాయకులు పోటు రాంరెడ్డి, గొడిసెల బాపురెడ్డి, చల్ల రాంరెడ్డి, సత్యనారాయణరెడ్డి, సత్తిరెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పిట్ట శ్రీనివాస్‌రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Blogger ఆధారితం.