-->

భూపాలపల్లి జిల్లాలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

భూపాలపల్లి జిల్లాలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పర్యటన


భూపాలపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక బిఎల్ఎం గార్డెన్‌లో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, మంజూరు పత్రాలు, సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు, కల్యాణ లక్ష్మి పథక చెక్కులు పంపిణీ చేయనున్నారు.

అంతేకాకుండా, మేడిగడ్డ వద్ద ప్రమాదవశాత్తు మరణించిన బాధిత కుటుంబాలను మంత్రి వ్యక్తిగతంగా పరామర్శించనున్నారు. అనంతరం కాటారం గ్రామపంచాయతీ పరిధిలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్‌ను ప్రారంభించనున్నారు.

తదుపరి మద్దులపల్లి, ధర్మసాగర్, అంకుశాపూర్, రేగులగూడెం, నూతన గ్రామపంచాయతీలలో అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు, అలాగే ములుగుపల్లి, మాదారం, బోర్లగూడెం ప్రాంతాల్లో అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి.

Blogger ఆధారితం.