దేవాదుల ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష – ఐప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్
ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ మల్లు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
17 నియోజకవర్గాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ పూర్తి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని భట్టి విక్రమార్క్ చెప్పారు. భూసేకరణకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడతలవారీగా విడుదల చేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలో రెండు సీజన్లకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నప్పటికీ భవిష్యత్తులో ఆయకట్టు విస్తరణకు దశలవారీ ప్రణాళిక సిద్ధమవుతోందని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మంత్రి సీతక్క, మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment