-->

ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలింపు – రాజస్థాన్ వ్యక్తి అరెస్ట్

ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలింపు – రాజస్థాన్ వ్యక్తి అరెస్ట్


భద్రాద్రి : ఒరిస్సా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 43 కిలోల గంజాయిని ఖమ్మం ఎన్ఫోర్స్‌మెంట్‌ విభాగం స్వాధీనం చేసుకుంది. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 22 లక్షలుగా అంచనా.

హైదరాబాద్‌కు చెందిన అద్దె కారు ద్వారా ఒరిస్సా ప్రాంతానికి వెళ్లి, అక్కడి నుంచి 43 కిలోల గంజాయిని తెచ్చే ప్రయత్నంలో సురేందర్ సింగ్‌ (23) అనే రాజ్‌కోట్‌, రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి భద్రాచలం సమీపంలో పట్టుబడ్డాడు. అతడు కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముండి గంజాయి విక్రయాలు జరుపుతున్నట్టు విచారణలో వెల్లడైంది.

భద్రాచలం ఇసుక స్టాండ్‌ సమీపంలో, పక్కా సమాచారం ఆధారంగా ఎస్సై శ్రీధర్‌రావు, హెడ్‌కానిస్టేబుళ్లు ఎంఏ ఖరీమ్‌, జి.బాలు, కానిస్టేబుళ్లు వెంకట్‌, సుధీర్‌, హరిష్‌, వీరబాబు, ఉపేందర్‌లతో కూడిన ఎన్ఫోర్స్‌మెంట్‌ బృందం వాహనాల తనిఖీలు చేపట్టి గంజాయిని పట్టుకున్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి, కారు భద్రాచలం ఎక్సైజ్‌ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఖమ్మం ఎన్ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ను డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం, అసిస్టెంట్‌ కమిషనర్‌ జి. గణేష్‌ అభినందించారు.

Blogger ఆధారితం.