-->

భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక


భద్రాచలం, ఈరోజు ఉదయం 8.15 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 43 అడుగులకు చేరింది. ప్రస్తుతం 9,32,288 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వెల్లడించారు.

దీంతో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లా యంత్రాంగం వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ప్రజలు రక్షణ చర్యల్లో సహకరించాలని, అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలకు సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించవచ్చు అని కలెక్టర్ పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793