మార్వాడీల దాడులను నిరసిస్తూ ఆగస్టు 22న తెలంగాణ బంద్
హైదరాబాద్: మార్వాడీల దాడులను నిరసిస్తూ ఈ నెల 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్‌ను నిర్వహించనున్నట్లు ఓయూ జేఏసీ ప్రకటించింది. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద మీడియాతో మాట్లాడుతూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన మార్వాడీలు తెలంగాణ సంప్రదాయ కుల వృత్తులను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్వాడీలు స్థానిక వృత్తిదారులపై ఆర్థిక దాడి చేసి, రాష్ట్ర ప్రజల ఆర్థిక వ్యవస్థను దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఆగస్టు 22న జరగనున్న బంద్‌లో పాల్గొని, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేఏసీ నేతలు “మార్వాడీలు గో బ్యాక్… తెలంగాణ వృత్తులను రక్షించండి” అంటూ నినాదాలు చేశారు.

Post a Comment