వినాయక విగ్రహం తరలించెలో విషాదం ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి
హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పై తరలిస్తున్న సమయంలో ట్రాక్టర్‌పై ఉన్న విగ్రహం పైభాగం హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలింది.
ఈ ప్రమాదంలో టోనీ (21), వికాస్ (20) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు అఖిల్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అఖిల్‌ను తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానికుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. విద్యుత్ వైర్లు కిందకు వంగి ఉండటమే ఈ దుర్ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
వినాయక నిమజ్జన ఉత్సాహం మధ్య ఈ ఘటన చోటుచేసుకోవడంతో బండ్లగూడ ప్రాంతంలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబాలు కన్నీటి పర్యంతమయ్యాయి.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment