-->

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్‌గా గద్దల రమేష్

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్‌గా గద్దల రమేష్


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన పాల్వంచ కాంగ్రెస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ గద్దల రమేష్‌ను టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్‌గా నియమించారు.

ఈ నియామక పత్రాన్ని శనివారం ఆయన నివాసంలో టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం అందజేశారు.

ఈ సందర్భంగా గద్దల రమేష్ మాట్లాడుతూ –“గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా, పార్టీ కోసం కట్టుబడి పనిచేశాను. నా కృషిని గుర్తించి ఈ పదవిని అప్పగించిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేంద్ర పౌలు గౌతం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్, భద్రాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షులు పొదేం వీరయ్య లకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793