పదవ తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు – తల్లిదండ్రుల ఆగ్రహం
నల్లగొండ జిల్లా: నకిరేకల్ విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడే అసభ్యకరంగా ప్రవర్తించి ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం ప్రకారం, ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు గత మూడు నెలలుగా విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థిని ఎవరికీ చెప్పుకోలేక నిశ్శబ్దంగా భరించింది. శుక్రవారం రాత్రి తండ్రి ప్రశ్నించడంతో వాస్తవాన్ని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
వెంటనే ఆగ్రహంతో ఉన్న తండ్రి శనివారం ఉదయం ఉపాధ్యాయుడిని పిలిపించి దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రైవేటు కళాశాలను కూడా నడుపుతున్న ఆ ఉపాధ్యాయుడు అక్కడ కూడా అనేకమంది విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ సంఘటనపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి కీచక ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Post a Comment