-->

గణేష్ నిమజ్జనంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

 

గణేష్ నిమజ్జనంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

గణేష్ నిమజ్జనంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

ఎండపల్లి: గణేష్ నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కొప్పుల రాజశేఖర్ (23) నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న సమయంలో ప్రమాదానికి గురైనట్లు గ్రామస్థులు తెలిపారు. రాత్రి సుమారు 11 గంటల సమయంలో సౌండ్ బాక్సులకు విద్యుత్ సరఫరా చేసే మెయిన్ వైర్లను కర్రతో సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమాచారం.

వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. యువకుడి మృతితో కొత్తపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.