కొత్తగూడెం టూ-టౌన్ ఎస్ఐ వెంకన్న మృతి బాధాకరం: సీఎం రేవంత్ రెడ్డి
కొత్తగూడెం టూ-టౌన్ ఎస్ఐ వెంకన్న మృతి బాధాకరం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కొత్తగూడెం టూ-టౌన్ ఎస్ఐ కె. వెంకన్న మృతి చెందడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ వెంకన్న ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని సీఎం అన్నారు. ఆయన మరణం కుటుంబ సభ్యులకే కాకుండా మొత్తం పోలీసు శాఖకు తీరని లోటని పేర్కొన్నారు. వెంకన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన సీఎం.. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బాధ్యతారాహిత్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిని గుర్తించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు.

Post a Comment