విజయవాడ ఇంద్రకీలాద్రిపై అందుబాటులోకి లడ్డూ ప్రసాదం ఏటీఎం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అందుబాటులోకి లడ్డూ ప్రసాదం ఏటీఎం
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదం ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఈ లడ్డూ ప్రసాదం ఏటీఎంను ప్రారంభించారు.
ఏటీఎం తరహాలో ఏర్పాటు చేసిన ఈ సదుపాయం ద్వారా భక్తులు తమకు అవసరమైన లడ్డూ ప్రసాదం బాక్సులను సులభంగా పొందవచ్చు. రూ.100, రూ.200, రూ.300, రూ.400 విలువల బాక్సుల రూపంలో లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుంది.
ఒక్కో బాక్సులో 6 లడ్డూలు ఉంటాయి. ఒక్కో లడ్డూ బాక్సు ధర రూ.100గా నిర్ణయించారు. భక్తులు ఏటీఎంలో ఆప్షన్లను సెలెక్ట్ చేసుకుని తమకు కావాల్సిన సంఖ్యలో లడ్డూ బాక్సులను పొందే విధంగా ఈ సదుపాయాన్ని రూపొందించారు.
భక్తులు క్యూలలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా లడ్డూ ప్రసాదాన్ని సులభంగా పొందేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది.

Post a Comment