రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి.. మరొకరికి గాయాలు
రైలు ఢీకొని నలుగురు యువకులు మృతి.. మరొకరికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా: రైలు ఢీకొని నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. టెక్కలి నియోజకవర్గ పరిధిలోని రావివలస వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
చేపలు పట్టేందుకు వెళ్తున్న నలుగురు యువకులు రైల్వే ట్రాక్ పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పరిశీలించి మృతుల వివరాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment