పోలీసు శాఖలో హోంగార్డు ఆఫీసర్స్ సేవలు ప్రశంసనీయం: ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హోంగార్డ్స్ సేవలను కొనియాడారు.
కార్యక్రమం ఆరంభంలో ఎస్పీ రోహిత్ రాజు శాంతి కపోతాన్ని ఆకాశంలోకి ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం హోంగార్డు ఆఫీసర్స్ అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. సుందరంగా అలంకరించిన వాహనాలతో పాల్గొన్న 06 హోంగార్డ్స్ ప్లాటూన్ల పరేడ్‌ను ఎస్పీ పరిశీలించారు.
హోంగార్డ్స్ సేవలు అమూల్యం – ఎస్పీ రోహిత్ రాజు
అలాగే…
- ప్రజా రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని,
- పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల బందోబస్తులో హోంగార్డ్స్ విజయవంతంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని,
- నిత్యం క్రమశిక్షణతో విధులు నిర్వహించడం పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించడంలో ముఖ్యమని తెలిపారు.
హోంగార్డ్స్ సంక్షేమానికి అన్ని వేళలా ముందుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
సత్కారాలు – బహుమతులు
- త్వరలో పదవీ విరమణ పొందుతున్న 2 మంది హోంగార్డ్స్ ఆఫీసర్లు సన్మానితులయ్యారు.
- హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
- విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డ్స్‌కు ప్రశంసా పత్రాలను అందజేశారు.
కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను ఎస్పీ హోంగార్డ్స్‌తో కలిసి కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఆర్ఐ నరసింహారావు తదితర అధికారులను ఎస్పీ అభినందించారు. అనంతరం అల్పాహార విందులో పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, 2టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, 1టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, హోమ్ గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, జిల్లా హోమ్ గార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..

Post a Comment