ఓసిపి-1 మేనేజర్‌కు HMS నాయకుల వినతిపత్రం
ఓసిపి-1 మేనేజర్ గారికి హెచ్‌ఎంఎస్ (HMS) ఆధ్వర్యంలో గెలిచిన సంఘాల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో, ఇకపై అన్ని సంఘాలను సమానంగా పరిగణించాలని కోరుతూ హెచ్‌ఎంఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ వినతిపత్రాన్ని హెచ్‌ఎంఎస్ కేంద్ర కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘాల కాలపరిమితి పూర్తయిన దృష్ట్యా, యాజమాన్యం ఏ ఒక్క సంఘానికే ప్రాధాన్యం ఇవ్వకుండా అన్ని సంఘాలపై సమానంగా వ్యవహరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ ఉపాధ్యక్షులు శాంతి స్వరూప్, కార్యదర్శి కాటం వీరయ్య, సహాయ కార్యదర్శి షకీల్, పిట్ కార్యదర్శి సంగి రవి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment