-->

శరణార్థులుగా వచ్చి చోరీలు ముగ్గురు మయన్మార్ వాసులు అరెస్ట్

శరణార్థులుగా వచ్చి చోరీలు ముగ్గురు మయన్మార్ వాసులు అరెస్ట్


నల్గొండ | జనవరి 13: దేశంలోకి శరణార్థులుగా వచ్చి చోరీలకు పాల్పడుతున్న మయన్మార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్గొండ అడిషనల్ ఎస్పీ జి. రమేశ్ వెల్లడించారు. నిందితులు ప్రధానంగా కంపెనీలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 7వ తేదీన నల్గొండ టౌన్ పరిధిలోని ఓ కంపెనీలో చోరీ జరిగిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టగా, తనిఖీల్లో నిందితులు పట్టుబడ్డారని పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793