బావిలో కారు.. కారులో కుళ్లిపోయిన మృతదేహం
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెగురుపల్లి గ్రామంలో బావిలో ఓ కారు కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది దాదాపు 14 గంటల పాటు శ్రమించి బావిలో ఉన్న కారును బయటకు తీసారు.
కారు లోపల ఊటూరు గ్రామానికి చెందిన రాజు మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. మృతదేహాన్ని బయటకు తీసిన అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గమనించాల్సిన విషయం ఏమిటంటే, గతంలో రాజు తండ్రి నాగయ్య కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం ఇప్పుడు ఈ కేసుపై మరిన్ని సందేహాలకు దారితీస్తోంది. రాజు మృతి వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Post a Comment