భారీ అగ్ని ప్రమాదం.. ప్లాస్టిక్ రీసైకిల్ యూనిట్‌లో ఎగిసిపాడుతున్న మంటలు
హైదరాబాద్, జనవరి 13: హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ నియోజకవర్గం బుద్వేల్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ రీసైకిల్ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.
మంగళవారం (జనవరి 13) ఉదయం యూనిట్‌లో మంటలు చెలరేగగా, దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్ముకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఇంజిన్ రావడంలో కొంత ఆలస్యం కావడంతో మంటలు భారీగా వ్యాపించినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే యూనిట్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Post a Comment