లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపకుడు మెల్విన్ జోన్స్ 147వ జయంతి వేడుకలు
కొత్తగూడెం, జనవరి 14: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపకుడు (Founder Lion) మెల్విన్ జోన్స్ 147వ జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు నిదర్శనంగా ఒక మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఇటీవల తెలుగు ప్రపంచ మహాసభల కవి సమ్మేళనంలో బహుమతులు పొందిన కవులు తూముల శ్రీనివాస్, మహమ్మద్ ముస్తఫా, ఎస్.డి. అబ్దుల్ నజీర్‌లను ఘనంగా సన్మానించారు. అలాగే క్లబ్‌లోని MJF సభ్యులకు ప్రత్యేక సన్మానం నిర్వహించారు.
అదేవిధంగా కేవలం 10 ఏళ్ల వయసు నుంచే పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రతిరోజూ ఒక మొక్క నాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కుమారి నౌనిక రిజ్యాను ప్రత్యేకంగా అభినందించి సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, ప్రోగ్రాం చైర్‌పర్సన్ లయన్ బొక్క శ్రీనివాస్, లయన్ పగడాల నగేష్, MJF సభ్యులు, RC లయన్ సతులూరి సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ జాయింట్ ట్రెజరర్ పి. సత్యనారాయణ, పాస్ట్ గవర్నర్ లయన్ చ.వి. శివప్రసాద్, పాస్ట్ RC, భద్రాచలం RTA లయన్ సంఘం వెంకటపుల్లయ్య, MJF లయన్ జె.బి. మోహన్, మండల రాజేశ్వర్ రావు, లయన్ బిట్టు గోవర్ధన్, లయన్ టి. శరథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment