రక్తదాత మోతే కృష్ణకు జాతీయ పురస్కారం – 2026
హైదరాబాద్ / కామారెడ్డి : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీవోలు మరియు వ్యక్తులకు జాతీయ పురస్కారాలు ప్రదానం చేశారు.
సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో,
- 2025 సంవత్సరంలో మూడుసార్లు రక్తదానం చేసిన వారికి ఉత్తమ రక్తదాత పురస్కారాలు,
- రక్తదాన శిబిరాల నిర్వహణకు సహకరించిన వారికి ఉత్తమ మోటివేటర్ అవార్డులు,
- రక్తదాన శిబిరాలను నిర్వహించిన సంస్థలకు ఉత్తమ రక్తదాన శిబిరాల పురస్కారాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రక్తదాన సేవల్లో ప్రతిభ చూపిన 79 మందికి జాతీయ స్థాయి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పట్టణానికి చెందిన యూత్ సర్కిల్ బ్లడ్ డోనర్స్ మరియు ఐక్య తల్లిదండ్రుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి, రక్తదాత మోతే కృష్ణకు జాతీయ పురస్కారం – 2026 వరించింది.
ఈ అవార్డుకు ఎంపిక చేసిన బాలు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే,
- ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త,
- ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,
- కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్కుయూత్ సర్కిల్ బ్లడ్ డోనర్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున మోతే కృష్ణ, పాషా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment