పట్టాలు తప్పిన గూడ్స్ రైలు పలు రైలు సర్వీసులు ఆలస్యం
నెల్లూరు జిల్లా కావలి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీ నుంచి రేణిగుంటకు వెళ్తున్న గూడ్స్ రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్‌కు స్వల్ప నష్టం వాటిల్లింది.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ఘటన కారణంగా ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

Post a Comment