ఆరోగ్య హాస్పిటల్ నిర్లక్ష్యం చికిత్స పేరిట లక్షల వసూళ్లు.. చివరికి వ్యక్తి మృతి
కుటుంబ సభ్యుల తీవ్ర ఆరోపణలు
మంచిర్యాల, జనవరి 14: మంచిర్యాల జిల్లాలోని ఆరోగ్య హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. వాడ్లూరి శ్రీనివాస్ (54) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
నాలుగు నెలల క్రితం కాలుకు గాయంతో ఆరోగ్య హాస్పిటల్‌లో చేరిన శ్రీనివాస్‌కు నాలుగుసార్లు ఆపరేషన్లు చేసినప్పటికీ, సరైన వైద్యం అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆయన పరిస్థితి క్రమంగా క్షీణించి చివరకు మృతి చెందారని తెలిపారు.
చికిత్స కోసం ఇప్పటికే రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చయిందని, అయినప్పటికీ మరో లక్ష రూపాయలు చెల్లించాలంటూ హాస్పిటల్ యాజమాన్యం డిమాండ్ చేసినట్లు బాధిత కుటుంబం వాపోయింది.
ఈ ఘటనపై న్యాయం చేయాలని, సంబంధిత డాక్టర్లు మరియు హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు. ఘటనపై విచారణ జరిపించాలని స్థానికంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Post a Comment