-->

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్!

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్!


హైదరాబాద్, జనవరి 13: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడ వద్ద కట్టెల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రహదారిపై కట్టెలు చెల్లాచెదురుగా పడిపోయి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

మరోవైపు సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ కారణంగా NH–65పై ట్రాఫిక్ మరింత పెరిగింది. ఈ ఘటనతో సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని తొలగిస్తూ, ట్రాఫిక్‌ను క్రమంగా క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793