-->

నల్లగొండలో దారుణ హత్య.. కూలీల మధ్య ఘర్షణలో వ్యక్తి మృతి

నల్లగొండలో దారుణ హత్య.. కూలీల మధ్య ఘర్షణలో వ్యక్తి మృతి


నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి గ్రామానికి చెందిన చంద్రు (35) కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రైల్వే కూలిపని నిమిత్తం ఇటీవల నల్లగొండకు వచ్చాడు.

గురువారం రాత్రి సమయంలో తోటి కూలీల మధ్య జరిగిన ఘర్షణలో చంద్రుపై దాడి జరిగింది. ఈ క్రమంలో రాళ్లతో కొట్టి చంద్రును హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో చంద్ర అన్నతో పాటు వారి మేస్త్రికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.

శుక్రవారం ఉదయం ఘటన వెలుగులోకి రావడంతో టూ టౌన్ ఎస్‌ఐ యర్ర సైదులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

హత్యకు గల కారణాలపై టూ టౌన్ ఎస్‌ఐ సైదులు నేతృత్వంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793