-->

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం ఆదిలాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం ఆదిలాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన


సంక్రాంతి పండుగ ముగియడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం నుంచి అధికారికంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

జనవరి 16న (శుక్రవారం) సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనతో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అధికార కాంగ్రెస్ పార్టీ గట్టి సంకేతాలు ఇచ్చినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

డిసెంబర్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ, అదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే సమగ్ర ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసిన పార్టీ, సీఎం పర్యటనలతో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది.

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం స్వయంగా రంగంలోకి దిగడం రాజకీయంగా కీలకంగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793