-->

ఉద్యోగం కోసం వెళ్లిన యువతి అదృశ్యం ఉట్కూర్ మండలంలో కలకలం

ఉద్యోగం కోసం వెళ్లిన యువతి అదృశ్యం ఉట్కూర్ మండలంలో కలకలం


మహబూబ్‌నగర్ జిల్లా ఉట్కూర్ మండలంలో కలకలం

మహబూబ్‌నగర్‌లో ఉద్యోగం దొరికిందని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన ఉట్కూర్ మండలంలో చోటుచేసుకుంది.

ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని పెద్ద పొర్ల గ్రామానికి చెందిన వెంకటయ్య కుమార్తె (21) డిగ్రీ పూర్తి చేసి గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నెల 15వ తేదీ ఉదయం 10:30 గంటల సమయంలో “మహబూబ్‌నగర్‌లో ఉద్యోగం వచ్చింది, ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటూ పని చేస్తాను” అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది.

అయితే ఆమె చెప్పిన ఫ్రెండ్స్ వద్దకు చేరుకోకపోవడంతో పాటు ఇంటికీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తండ్రి వెంకటయ్య బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రమేష్ తెలిపారు.

మిస్సింగ్ అయిన యువతి పింక్ కలర్ పంజాబీ డ్రెస్ ధరించి, సుమారు 5.1 అడుగుల ఎత్తు, చామన చాయ రంగు కలిగి ఉందన్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు ఉట్కూర్ పోలీసులను 87126 70412 నంబర్‌లో సంప్రదించాలని ఎస్సై రమేష్ విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793