పెళ్లి ఆగిపోవడంతో యువకుడు ఆత్మహత్య మానవపాడులో విషాద ఘటన
పెళ్లి ఆగిపోయిందన్న మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జోగులంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. మానవపాడు మండల కేంద్రానికి చెందిన వసంతకళ్యాణ్ రెడ్డి (33)కి మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన యువతితో వివాహ నిశ్చయం అయింది. జనవరి 15న గురువారం తిరుపతి ఆలయంలో వివాహం జరగాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల పెళ్లి రద్దైంది.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వసంతకళ్యాణ్ రెడ్డి శుక్రవారం ఉదయం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడికి వెళ్లి తిరిగొచ్చిన తల్లి ఈశ్వరమ్మ కుమారుడు అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే 108 అంబులెన్స్ ద్వారా అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ బి. స్వాతి తెలిపారు. ఈ ఘటనతో మానవపాడు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Post a Comment