సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత.. ప్యాట్నీ సెంటర్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు (వీడియో)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్యాట్నీ సెంటర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ‘సికింద్రాబాద్ బచావో ర్యాలీ’ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్యాట్నీ సెంటర్‌లోని ఆల్ఫా హోటల్‌లో టిఫిన్ చేస్తున్న సామాన్య ప్రజలను కూడా బలవంతంగా అరెస్ట్ చేయడం, అనంతరం హోటల్‌ను మూసివేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“టిఫిన్ తినడానికి వచ్చిన వారిని కూడా అరెస్ట్ చేయడం అన్యాయం” అంటూ పోలీసుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రాంతమంతా భద్రత కట్టుదిట్టంగా ఉండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు.

Post a Comment