మేడారం మహా జాతర కోసం టీజీఎస్ ఆర్టీసీ 4 వేల ప్రత్యేక బస్సులు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి పొందిన మేడారం మహా జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 4,000 ప్రత్యేక బస్సులు, మొత్తం 42,810 ట్రిప్పులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ సేవల ద్వారా సుమారు 20 లక్షల మంది భక్తులను సమ్మక్క–సారలమ్మల దర్శనానికి చేర్చేలా ప్రణాళిక రూపొందించింది.
ఇంటి వద్దకే అమ్మవారి ప్రసాదం
ఈ ప్రసాద ప్యాకెట్‌లో
- అమ్మవార్ల ఫొటో
- బెల్లం
- పసుపు
- కుంకుమ
జనవరి 28 నుంచి మేడారం జాతర
2026 జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు మేడారం మహా జాతర జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలిరానుండటంతో, రవాణా, భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

Post a Comment