-->

నేడు మేడారం మహా జాతరకు తెలంగాణ మంత్రుల రాక

నేడు మేడారం మహా జాతరకు తెలంగాణ మంత్రుల రాక


ములుగు జిల్లా, జనవరి 11: ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు ఈనెల 19న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో, జాతర ఏర్పాట్లను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో మేడారం మహా జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు నేడు పలువురు రాష్ట్ర మంత్రులు మేడారం పర్యటించనున్నారు. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దుద్దుల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ పర్యటనలో పాల్గొననున్నారు.

ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు మేడారం చేరుకున్న అనంతరం అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం మహా జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఈనెల 18, 19 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు మేడారం పర్యటనకు రానున్న నేపథ్యంలో, భద్రత, రవాణా, త్రాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.

జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టారు. మహా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793