-->

సంక్రాంతి ఎఫెక్ట్.. ఆకాశాన్ని తాకిన విమాన ఛార్జీలు

సంక్రాంతి ఎఫెక్ట్.. ఆకాశాన్ని తాకిన విమాన ఛార్జీలు


సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ ఊరెళ్లే ప్రయాణికులకు విమాన టికెట్ ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. పండగ రద్దీ కారణంగా దేశీయ విమాన ఛార్జీలు అనూహ్యంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గన్నవరం, తిరుపతి వంటి ప్రాంతాలకు కేవలం రూ.3 వేల వరకు ఉండే టికెట్ ధరలు, సంక్రాంతి పీక్ డేస్ అయిన జనవరి 12, 13 తేదీల్లో ఏకంగా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పలుకుతున్నాయి.

అదేవిధంగా పండగ అనంతరం తిరుగు ప్రయాణానికి కూడా ధరల భారం తప్పడం లేదు. జనవరి 17, 18 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు రావాలంటే టికెట్ ధరలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం వెళ్లే విమానాలకు డిమాండ్ భారీగా పెరగడంతో సగటున టికెట్ ధరలు రూ.14 వేల వరకు చేరాయి.

ఈ పెరిగిన ధరలు మధ్యతరగతి ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రత్యామ్నాయంగా రైలు, బస్సు ప్రయాణాల వైపు మొగ్గు చూపుతున్నా, అక్కడ కూడా టికెట్ల లభ్యత కష్టంగా మారింది. సంక్రాంతి పండగ ప్రభావం విమాన రంగంపై స్పష్టంగా కనిపిస్తోందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793