-->

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఎస్సై డేగ రమేష్

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ఎస్సై డేగ రమేష్


హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడూ తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని మంథని పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ డేగ రమేష్ పిలుపునిచ్చారు.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో భాగంగా, మంథని కాలేజీ గ్రౌండ్‌లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాన్ని పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్సై డేగ రమేష్ మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, “హెల్మెట్ ధరించండి – ప్రాణాలు కాపాడుకోండి” అనే నినాదాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793